అమృతకు ప్రాణ భయం అవసరం లేదు.. ఎలాంటి ఆపద రాదని భరోసా ఇస్తున్నాం: నల్గొండ ఎస్పీ
- ప్రణయ్ హత్య కేసు చాలా సెన్సిటివ్
- కూతురుని నమ్మించి అల్లుడిని హత్య చేశాడు
- కేసు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం
అమృత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని చెప్పారు. అమృతకు ఎలాంటి ప్రాణ భయం అవసరం లేదని తెలిపారు. వాళ్ల ఇంటికి వెళ్లడానికి ఆమె భయపడితే, రెస్క్యూ హోమ్ కు తరలిస్తామని చెప్పారు. అమృతకు ఎలాంటి ఆపద రాదని భరోసా ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే కేసుకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కూతురుని నమ్మించి అల్లుడిని మారుతీరావు హత్య చేశాడని తెలిపారు.