నా కూతురిపై ప్రేమతోనే హత్య చేయించా.. ప్రణయ్ ని హత్య చేయించినందుకు బాధ లేదు: విచారణలో మారుతీరావు
- తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చా
- ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్ వినలేదు
- సమాజంలో పరువే ముఖ్యమని భావించాను
తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ప్రణయ్ కి, అమృతకు వార్నింగ్ ఇచ్చానని... ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్ వినలేదని తెలిపాడు. తన కూతురి కన్నా సమాజంలో తన పరువే ముఖ్యమని భావించానని చెప్పాడు. తన కుమార్తెకు ఎలాంటి హాని కలగకూడదని సుపారీ గ్యాంగ్ (హత్య చేసిన వారు)కు ముందే చెప్పానని తెలిపాడు. ప్రణయ్ ని చంపించినందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పాడు. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధపడే ఈ హత్య చేయించానని తెలిపాడు.
ప్రణయ్ హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ తో పాటు ఇద్దరు సుపారీ కిల్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను హత్య చేసేందుకు రూ. 10 లక్షల సుపారీకి డీల్ కుదిరింది. రూ. 5 లక్షలను అడ్వాన్స్ గా మారుతీరావు ఇచ్చాడు. గత రెండు నెలలుగా సుపారీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది.