'మంచి కోడలు కావాలా? అయితే మా దగ్గరకి రండి!' అంటున్న భోపాల్ యూనివర్సిటి
- భోపాల్ లోని వర్సిటీలో సరికొత్త కోర్సు
- అత్తారింటిలో మసలుకోవడంపై శిక్షణ
- త్వరలోనే ప్రారంభించనున్న విశ్వవిద్యాలయం
ఈ కోర్సుతో పాటు శిక్షణను వర్సిటీలోని సైకాలజీ, సోషియాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్నాయని వెల్లడించారు. అమ్మాయి అత్తవారింట్లో త్వరగా సర్దుకుపోగలిగితే ఆ కుటుంబమంతా ఆనందంగా ఉంటుందని గుప్తా తెలిపారు. తమ దగ్గర శిక్షణ పొందిన అమ్మాయిలు మంచి కోడళ్లుగా రాణిస్తారని హామీ కూడా ఇచ్చారు. ఇందుకోసం ప్రతి బ్యాచ్ కు 30 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తామనీ, వచ్చే ఏడాది ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.