చంద్రబాబు తిరుపతి పర్యటనలో అపశ్రుతి... విధులు నిర్వహిస్తున్న ఎస్సై మృతి!
- ఏర్పేడు ఎస్ఐగా పని చేస్తున్న వెంకటరమణ
- చంద్రబాబు పర్యటనలో బందోబస్తు విధులు
- గుండెపోటుకు గురై మరణించిన వెంకటరమణ
ఏర్పేడు ఎస్ఐగా పని చేస్తున్న వెంకటరమణను తిరుపతి బందోబస్తు విధుల్లో భాగం చేశారు. ఈ ఉదయం చంద్రబాబు కాన్వాయ్ రేణిగుంట వెళ్లేందుకు బందోబస్తులో నిమగ్నమైన వేళ వెంకటరమణకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు దక్కలేదు. వెంకటరమణ మృతితో ఆయనింట తీవ్ర విషాదఛాయలు అలముకోగా, ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.