చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లే ఏపీకి ఐటీ కంపెనీలు భారీగా వస్తున్నాయ్!: మంత్రి లోకేశ్
- ఆయన వల్లే హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ
- గన్నవరంలో హెచ్ సీఎల్ ఆఫీస్ ప్రారంభం
- వెయ్యి ఉద్యోగాలు వస్తాయన్న లోకేశ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కంపెనీ వల్ల ఏపీలో 1,000 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో సేవలు అందించనుందని తెలిపారు. 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామనీ, దాన్ని నిలబెట్టుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయులు ఉంటే, ఆ నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారు ఉంటున్నారని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ఏర్పాటు చేసిన హెచ్ సీఎల్ ప్రతినిధులకు లోకేశ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.