బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదేలు అనుచరులు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కార్యకర్త.. ఉద్రిక్తత!
- బాల్క సుమన్ కు నిరసన సెగ
- ఓదేలుకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
- ఇందారంలో ఉద్రిక్తత
ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ముగ్గురికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఓదేలు మద్దతుదారులు నినాదాలు చేశారు.