సర్వే నివేదికను బాల్క సుమన్ తారుమారు చేశాడు: టీఆర్ఎస్ నేత ఓదేలు
- సర్వేలో అరవై శాతం నాకు అనుకూలంగా వచ్చింది
- ఆ నివేదికను బాల్క సుమన్ తారుమారు చేశాడు
- తప్పుడు నివేదికను అధిష్ఠానానికి ఆయన పంపారు!
ఈ సందర్భంగా ఓదేలు మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన సర్వే అరవై శాతం తనకు అనుకూలంగా వచ్చిందని, అయితే, ఈ నివేదికను బాల్కసుమన్ తారుమారు చేసి టీఆర్ఎస్ అధిష్ఠానానికి తప్పుడు నివేదికను పంపారని ఆరోపించారు. బాల్క సుమన్ తో కలిసి పని చేస్తానని తానెన్నడూ చెప్పలేదన్న ఓదేలు, ఈ నియోజకవర్గ టికెట్ ను తిరిగి తనకే ఇస్తారని తన అనుచరులతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ గా బాల్క సుమన్ ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.