హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు తీర్పును వాయిదా వేసిన ఎన్ఐఏ కోర్టు!
- 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు
- ఎనిమిది మందిని నిందితులుగా తేల్చిన కోర్టు
- పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు
ఈ కేసులో రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అనిక్ షఫీక్, ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీక్, మహ్మద్ షేక్, షఫ్రుద్దీన్, అమీర్ రిజాఖాన్లను కోర్టు నిందితులుగా తేల్చింది. ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురిపై విచారణ కొనసాగింది. 2007 ఆగస్టు 25న ఈ జంట పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 68 మందికి గాయాలయ్యాయి.