పెద్దాయనా.. మీ పుట్టిన రోజుకు నేను తప్పకుండా వస్తా!: యడ్లపాటికి మాటిచ్చిన సీఎం చంద్రబాబు
- సీఎంను కలుసుకున్న సీనియర్ టీడీపీ నేత యడ్లపాటి
- పెద్దాయన ఆరోగ్యంపై వాకబు చేసిన చంద్రబాబు
- జీవితాంతం తాను, పార్టీ యడ్లపాటికి రుణపడి ఉంటామని వ్యాఖ్య
ఈ ఏడాది డిసెంబర్ 16న జరిగే తన 100వ జన్మదిన వేడుకలకు రావాలని వెంకట్రావు చంద్రబాబును ఆహ్వానించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘మీ ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. మీ వందో పుట్టిన రోజుకు తప్పకుండా వస్తా’ అని బాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మళ్లీ ఏపీ సీఎంగా చంద్రబాబే గెలుస్తారన్న నమ్మకం తనకుందని యడ్లపాటి వెంకట్రావు వ్యాఖ్యానించారు. యడ్లపాటి వెంట ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు.