syeraa: నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉందని నాన్న అన్నారు: రామ్ చరణ్

షార్ట్స్‌లో చూడండి
'సైరా' సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ మాట్లాడుతూ, భారీ బడ్జెట్ తోనే సినిమాను తెరకెక్కిస్తున్నామని... అయితే ఆ నంబర్లను వెల్లడించాలనుకోవడం లేదని చెప్పాడు. ఇది డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి దేనికీ వెనుకాడకుండా తీస్తున్నామని తెలిపాడు. ఈ సినిమాకు లాభాలు వస్తే బోనస్ అనుకుంటామని చెప్పాడు.

తనతో నాన్నగారు ఒక్క విషయాన్ని చెప్పారని ఈ సందర్భంగా చరణ్ గుర్తు చేసుకున్నాడు. 'నీపై నాకు ఏదైనా ఈర్ష్య ఉందంటే అది ఒక విషయంలో ఉంది. నీ రెండో సినిమాకే మంచి సోషియో ఫాటసీ, మంచి కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేశావు. నేను 40 ఏళ్లుగా 150 సినిమాలు చేశా. నాకు ఇప్పటి వరకు ఒక్క కాస్ట్యూమ్ డ్రామా సినిమా కూడా రాలేదు. అదే నా జలసీ' అని నాన్న తనతో ఓ సందర్భంలో నవ్వుతూ చెప్పారని చరణ్ తెలిపాడు. నాన్న కలల సినిమానే ఈ 'సైరా' అని చెప్పాడు. నాన్నకు కావాల్సినట్టు ఈ సినిమాను తీయడమే తన లక్ష్యమని, ప్రాఫిట్స్ లాంటివాటి గురించి తాము ఆలోచించడం లేదని తెలిపాడు. 
Go Back to Shorts
syeraa
Ramcharan
chiranjeevi

More Telugu News