సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బెల్లంకొండ సినిమాలో నాయికగా మెహ్రీన్ 
  • ఒకేసారి గోపీచంద్ రెండు సినిమాలు! 
  • మరోసారి ఫారిన్ వెళ్లనున్న 'సవ్యసాచి'
*  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన మెహ్రీన్ జతకట్టనుంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తన ఐదవ చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. ఇందులో ప్రధాన కథానాయికగా కాజల్ నటిస్తుండగా.. మరో కథానాయిక పాత్రకు తాజాగా మెహ్రీన్ ను ఎంపిక చేశారు.
*  ఇటీవలి కాలంలో సక్సెస్ కు దూరంగా వున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నాడు. వీటిలో ఒకటి, నూతన దర్శకుడు కుమార్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించేది. మరొకటి, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ రెండూ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మొదలవుతాయి.  
*  నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సవ్యసాచి' చిత్రానికి సంబంధించిన చిన్న షెడ్యూలును విదేశాలలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటుగా రీమిక్స్ సాంగ్ అయిన 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు..' పాటను కూడా ఫారిన్ షెడ్యూల్ లోనే చేస్తారని తెలుస్తోంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
Mehrin
Kajal Agarwal
Gopichand
Chaitanaya

More Telugu News