చంద్రబాబు బయోపిక్... శరవేగంగా 'చంద్రోదయం' షూటింగ్!

  • చంద్రబాబు వెన్నెముక తప్ప, వెన్నుపోటుదారుడు కాదు
  • అదే కథాంశంగా 'చంద్రోదయం'
  • అక్టోబర్ లో విడుదలకు సిద్ధం
తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు వెన్నెముకగా నిలిచారు తప్ప, వెన్నుపోటుదారుడిగా కాదన్న కథాంశంతో వెంకట రమణ దర్శకత్వంలో గండికోట రాజేంద్ర నిర్మాతగా తెరకెక్కుతున్న 'చంద్రోదయం' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాడేపల్లి గూడెం మండల పరిధిలోని పెద తాడేపల్లి సమీపంలో ఈ చంద్రబాబు బయోపిక్ లో ఎన్టీఆర్ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా గురించి ఇప్పటికే చంద్రబాబుకు వివరించామని అన్నారు. నెలాఖరుకు సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తామని, సెప్టెంబర్ తొలి వారంలో ఆడియోను విడుదల చేసి, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. నారావారిపల్లెతో పాటు హైదరాబాద్ లోని మాదాపూర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
NTR
Chandrodayam
Movie
Shooting

More Telugu News