అది ‘కశ్మీర్’ సమస్య లాంటిదే.. తన ప్రేమ వ్యవహారంపై విలేకరి ప్రశ్నకు వాజ్ పేయి పంచ్!
Add ap7am to your home Screen

అది ‘కశ్మీర్’ సమస్య లాంటిదే.. తన ప్రేమ వ్యవహారంపై విలేకరి ప్రశ్నకు వాజ్ పేయి పంచ్!

  • రాజ్ కుమారి కౌల్ గురించి ప్రశ్నించిన రిపోర్టర్
  • వ్యంగ్యంగా జవాబిచ్చిన వాజ్ పేయి
  • ప్రధాని సమాధానంతో నవ్వుల్లో మునిగిపోయిన మీడియా
వాగ్ధాటికి మారుపేరైన వాజ్ పేయి సందర్భోచితంగా మాట్లాడటంలోనూ అందవేసిన చేయి. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక వాజ్ పేయి ఓ సారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రిపోర్టర్లు అడుగుతున్న ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నారు. ఇంతలో ఓ కుర్ర రిపోర్టర్.. ‘వాజ్ పేయి గారు! అదంతా సరే. అసలు ఈ రాజ్ కుమారి కౌల్ వ్యవహారం ఏంటో తేల్చండి’ అని గట్టిగా ప్రశ్నించాడు. రాజ్ కుమారి కౌల్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాజ్ పేయి ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆగిపోయిన సంగతి తెలిసిందే.

యువ రిపోర్టర్ ప్రశ్నతో చుట్టపక్కల ఉన్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా సిబ్బంది విస్తుపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ సైలెంట్ గా అయిపోయారు. కానీ అప్పటివరకూ మీడియా ప్రశ్నలకు సీరియస్ గా జవాబిస్తున్న వాజ్ పేయి ముఖంలో మాత్రం నవ్వు కన్పించింది. వెంటనే వాజ్ పేయి గొంతు సవరించుకుని ‘‘ఇందులో తేల్చడానికి ఏముంది? అది కూడా ‘కశ్మీర్’ లాంటి వ్యవహారమే’’ అని హాస్యధోరణిలో జవాబిచ్చారు. దీంతో అక్కడ అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి.
vajpayee
marriage
love
kashmir
media
young reporter

More Telugu News