vijay devarakonda: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. 'అర్జున్ రెడ్డి'లో స్టూడెంట్ గా కనిపించిన ఆయన, 'గీత గోవిందం'లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను మెప్పించాడు. ఇక తాజాగా చేస్తోన్న 'డియర్ కామ్రేడ్'లో స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఈ ప్రాజెక్టు తరువాత చేయనున్న సినిమాలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. క్రాంతిమాధవ్ సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ ఉంటాయి. అదే విధంగా విజయ్ దేవరకొండతో చేసే సినిమా కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ జోడీగా ఆయన రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.    
Go Back to Shorts
vijay devarakonda
rasi khanna

More Telugu News