vajpayee: వాజ్ పేయిని పరామర్శించిన మమతా బెనర్జీ

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, మమతా బెనర్జీ కోల్ కతా నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు ఓ ట్వీట్ చేశారు. వాజ్ పేయిని చూసేందుకు ఇవాళ తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నానని పేర్కొన్నారు. గతంలో వాజ్ పేయితో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి అని, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. నాడు వాజ్ పేయి ప్రభుత్వం పడిపోతున్నప్పుడు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మమత ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Go Back to Shorts
vajpayee
manata banerjee

More Telugu News