‘ఆర్ఎక్స్ 100’ తమిళం రీమేక్ లో తాప్సీ!

అజయ్ భూపతి నూతన నటీనటులతో తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దీంతో దీన్ని ఇతర భాషల్లో తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు. తాజాగా అవురా సినిమాస్ సంస్థ ఈ సినిమాను తమిళంలో తీస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో హీరో గా ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకున్న నిర్మాతలు హీరోయిన్ గా తాప్సీని తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళ వెర్షన్ ఆర్ఎక్స్ 100 లో హీరోగా ఆది పినిశెట్టిని నిర్మాతలు ఎంపిక చేసుకున్నారు. మిరుగం, ఈరం, మరకదనానయం వంటి సినిమాల్లో నటించిన ఆదికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆది సరసన తాప్సీని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆడుకలం, కాంచన, ఆరంభం వంటి సినిమాల్లో నటించిన తాప్సీని నిర్మాతలు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇంకా దర్శకుడు ఎవరో ఖరారు కాలేదు. అక్టోబర్ మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
Go Back to Shorts
rx 100
tamil
remake
taapsee pannu
aadhi pinisetty

More Telugu News