‘అంతరిక్షం’లో వరుణ్ తేజ్.. ఫస్ట్ లుక్ విడుదల!
- సినిమా పేరు ‘అంతరిక్షం’గా ఖరారు
- డిసెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు
- విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న సంకల్ప్ రెడ్డి
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన అతిదిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఘాజీతో తొలి సినిమాకే హిట్ అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 21న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.