కేరళ వరద బాధితుల కోసం కదలిన కోలీవుడ్.. రూ.25 లక్షల విరాళం ప్రకటించిన కమల్
- వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ
- కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తికి భారీ స్పందన
- విరాళాలు ప్రకటించిన సూర్య, కార్తీ
కమల హాసన్, విజయ్ టీవీ చెరో రూ.25 లక్షల విరాళం ప్రకటించగా, సూర్య, అతడి సోదరుడు కార్తీ కలిపి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.10 లక్షలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సీఎం ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, వరదల్లో ఇప్పటి వరకు 33 మంది మృతి చెందగా, మరో ఆరుగురి జాడ గల్లంతైంది.