ఎన్టీఆర్ ఎక్కువగా రిహార్సల్స్ చేయరు: కమెడియన్ ప్రియదర్శి
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ ఎక్కువగా రిహార్సల్స్ చేయరు: కమెడియన్ ప్రియదర్శి

  • ఎన్టీఆర్ తో కలిసి నటించాను 
  • ఆయనకి జ్ఞాపక శక్తి ఎక్కువ
  • ఒక్కసారి డైలాగ్ చూసుకుని చెప్పేస్తారు
ఏ పాత్ర ఇచ్చినా తనదైన శైలిలో ఆ పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోతాడనే పేరుంది. అందువలన చాలా తక్కువ కాలంలోనే ఆయన ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన 'జై లవ కుశ' సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు. ఆ సినిమా సంగతులను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించాడు.

"జై లవ కుశ'లో ఎన్టీఆర్ మూడు పాత్రలను చేశారు .. ఒక పాత్రకి మరో పాత్రకి మధ్య ఎక్కడా పోలిక ఉండదు. ఈ సినిమా షూటింగు సమయంలో నేను విన్నాను .. ఆయన డైలాగ్స్ ను గానీ .. డాన్స్ ను గాని ఎక్కువగా ప్రాక్టీస్ చేయరని. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఒకసారి చూసుకుని కెమెరా ముందుకు వచ్చి టక్కున చెప్పేస్తారాయన. ఇంతటి జ్ఞాపక శక్తి కలిగిన ఆర్టిస్టులు కూడా వుంటారా? అని నేను ఆశ్చర్యపోయాను. సీన్ చేస్తున్నప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తారు .. అవతల ఆర్టిస్టును ఎంకరేజ్ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు. 
ntr
priyadarshi

More Telugu News