సనాతన్ సంస్థాన్ సభ్యుడి ఇంటిపై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడి.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
- పెట్రోల్ బాంబులు, డిటోనేటర్లు లభ్యం
- అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు
- ఈ రోజు కోర్టులో హాజరుపర్చే అవకాశం
గత కొంతకాలంగా రౌత్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు.. గురువారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అరెస్ట్ చేసిన అనంతరం ముంబైలోని ఏటీస్ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు రౌత్ ను కోర్టు ముందు ఏటీఎస్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
కాగా, రౌత్ ను అరెస్ట్ చేయడాన్ని హిందూ జాగృతి సమితి (హెచ్ జేఎస్) మాలేగావ్-2 గా అభివర్ణించింది. మహారాష్ట్రలోని ముస్లిం మెజారిటీ ప్రాంతమైన మాలేగావ్ లో 2008, సెప్టెంబర్ 29న బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కల్నల్ పురోహిత్ ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యారు. కాగా, హిందూ సంస్థలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోందని హెచ్ జేఎస్ ఆరోపించింది.