chiranjeevi: చిరంజీవి 152వ సినిమా హీరోయిన్ గా అనుష్క?

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి రైతుగా కనిపించనున్నారట. అందుకు సంబంధించిన పనుల్లో కొరటాల బిజీగా వున్నారని అంటున్నారు.

 'సైరా' సినిమాలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. అందువలన ఆ తరువాత సినిమా కోసం అనుష్క .. త్రిషతో పాటు కొంతమంది బాలీవుడ్ కథానాయికల పేర్లను కూడా పరిశీలించారని సమాచారం. అయితే క్రేజ్ పరంగా చూసినా .. జోడీ పరంగా చూసినా అనుష్క అయితేనే బాగుంటుందని భావించారు. అందువలన ఆమెను తీసుకోవడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేసి సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైనట్టేనని అంటున్నారు .. అయితే అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించవలసి వుంది. డిసెంబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. 
Go Back to Shorts
chiranjeevi
anushka

More Telugu News