విజయ్ దేవరకొండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్?
- 15వ తేదీన విడుదల కానున్న 'గీత గోవిందం'
- వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే యోచనలో టీమ్
- చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్న చిరంజీవి
తమ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తున్నారనే విషయం తెలియగానే విజయ్ దేవరకొండ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో విడుదలకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించగా... పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంది.