Rana: రియల్ చంద్రబాబును కలిసిన 'రీల్' చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ రియల్ చంద్రబాబును రీల్ చంద్రబాబు రానా కలిశారు. 'ఎన్టీఆర్'లో చంద్రబాబుగా నటించేందుకు రానా అంగీకరించినట్టు వస్తున్న వార్తలకు ఈ భేటీ మరింత బలం చేకూర్చింది. అమరావతి ఎంతో ఆకట్టుకునేలా ఉందని, సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు అమరావతి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రానా వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, సినీ టూరిజం పేరిట కొత్త తరహా ఆకర్షణను ప్రోత్సహించవచ్చన్న ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందిస్తామని అన్నారు. సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు సహకరించాలని చంద్రబాబు కోరారు. 
Go Back to Shorts
Rana
Chandrababu
Balakrishna
Krish
NTR

More Telugu News