Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన బాలక‌ృష్ణ, దర్శకుడు క్రిష్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ నటుడు బాలక‌ృష్ణ, దర్శకుడు క్రిష్ కలిశారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ విషయమై చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ స్నేహితులను పిలిపించి బాలకృష్ణ మాట్లాడినట్టు సమాచారం. రేపు, నిమ్మకూరు, కొమరవోలులో బాలకృష్ణ, క్రిష్ లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిన్నప్పటి నివాసాన్ని బాలకృష్ణ పరిశీలిస్తారని సమాచారం. కొమరవోలు వెళ్లి తన తల్లి బసవతారకం బంధువులతో బాలకృష్ణ మాట్లాడతారని తెలుస్తోంది. కాగా, బాలక‌ృష్ణ, క్రిష్ తో పాటు నటుడు రానా కూడా చంద్రబాబును కలిశారు.
Go Back to Shorts
Chandrababu
Balakrishna
rana
krish

More Telugu News