'అరవింద సమేత ..' దసరాకి రావడం ఖాయమే
Add ap7am to your home Screen

'అరవింద సమేత ..' దసరాకి రావడం ఖాయమే

  • 75 శాతం జరిగిన షూటింగ్ 
  • సెప్టెంబర్ 15 నాటికి షూటింగు పార్టు పూర్తి
  • అక్టోబర్లో విడుదల చేయాలనేది నిర్ణయం    
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగానే సెట్స్ పైకి వచ్చింది. దాంతో ఈ సినిమా దసరాకి కాకుండా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు వున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, అందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.

షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పక్కా ప్లానింగ్ తో అనుకున్న పనులను అనుకున్నట్టుగా త్రివిక్రమ్ పూర్తి చేస్తున్నాడట. ఇప్పటికే 75 శాతం షూటింగును ఆయన పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడని అంటున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన ఆర్టిస్టుల డేట్స్ కూడా ఆ రోజు వరకే తీసుకున్నారట. కనుక దసరా కానుకగా అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమేనని అంటున్నారు.    
ntr
pooja hegde

More Telugu News