trivikram: సెట్ లోకి మొబైల్స్ తీసుకురావొద్దని చెప్పిన త్రివిక్రమ్

షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. కొన్ని రోజులుగా ప్రధాన పాత్రల కాంబినేషన్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. నాగబాబుల కాంబినేషన్లోని ఎమోషనల్ సీన్ కి సంబంధించిన ఒక ఫోటో లీక్ అయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫొటో హల్ చల్ చేస్తోంది.

ఇలా లొకేషన్ నుంచి ఒక ఫొటో లీక్ కావడాన్ని, గత అనుభవాల కారణంగా త్రివిక్రమ్ సీరియస్ గానే తీసుకున్నాడట. దీంతో, ఈ సినిమాకి సంబంధించిన వాళ్లంతా కూడా ఎవరూ సెట్ లోకి మొబైల్స్ తీసుకురావొద్దని ఆదేశించాడని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలనుకుంటే, సెట్ బయటికి వెళ్లి అక్కడ మాత్రమే మాట్లాడాలని గట్టిగానే చెప్పాడని అంటున్నారు.  
Go Back to Shorts
trivikram
ntr

More Telugu News