BJP: చంద్రబాబు గారూ... ఒక్క సీటు గెలవని బీజేపీ మాకెందుకు?: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
నిన్న రాత్రి చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించిన వేళ, బీజేపీకి నష్టం కలగకూడదని జనసేన ట్వీట్లు చేస్తోందని చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మండిపడ్డారు. "ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీని వెనకేసుకు రావటానికి మాకు వచ్చే లాభమేమిటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో రాష్ట్రంలో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? నా ట్వీట్ల వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బీజేపీతో సమానంగా టీడీపీ కూడా అంతే దారుణంగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది. ప్రజలను మోసం చేశారు. వంచించారు" అంటూ నిప్పులు చెరిగారు.

విషయాలన్నీ ఈరోజే తెలుసుకున్నట్టుగా తెలుగుదేశం ప్రవర్తించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించిన పవన్, బాబు సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోయాయని ఆరోపించారు. గత నాలుగేళ్లలో హోదాపై చంద్రబాబు, టీడీపీ ఎన్ని రకాలుగా మాటలు మార్చిందో తెలియనిది కాదన్నారు. తన వైఖరితో ఆంధ్ర ప్రజలను ఆత్మగౌరవం లేనివారిగా నిలిపారని, మోదీ కాళ్లకు టీడీపీ ఎంపీలు పాదాభివందనం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ టీడీపీని ఇంకా మిత్రులుగానే చూస్తున్నామని చెప్పడాన్ని చూస్తే, మీరు చేస్తున్నది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్మాలో చెప్పాలని అడిగారు.
Go Back to Shorts
BJP
Pawan Kalyan
Chandrababu
Twitter

More Telugu News