తనపై మండిపడ్డ ఓ నెటిజన్ కు క్లాస్ పీకిన యాంకర్ అనసూయ!
- అనసూయ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల స్పందన
- కారు డ్రైవర్ కు మద్దతుగా నిలిచిన ఓ నెటిజన్
- ఆ నెటిజన్ కు క్లాస్ పీకుతూ బదులిచ్చిన అనసూయ
‘అనసూయ గారు, మీరు ఫిర్యాదు చేయడం మంచి పనే అనుకుందాం. కానీ, ఒక్క నిమిషం మీ ఆడి క్యూ 7 కారు విండో దించి అతడికి చెప్పొచ్చుగా. మీరు ఇప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు అతడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే అతనికి ఆదాయం ఎలా వస్తుంది?' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
ఇందుకు అనసూయ స్పందిస్తూ, ‘మీ నోర్లు చాలా ఈజీగా మాపై జారుస్తారు.. ఇన్ని చెప్పినా మీకు నిజానిజాలు తెలుసుకోవాలనే ఇంగితం లేకపోవడం గమనార్హం. నేను కూడా కష్టపడే సంపాదిస్తున్నానండి. నా ఫ్యామిలీ కోసమే మా కష్టం, మా పని. మా ఫ్యామిలీస్ పై ఎందుకండి అంత చులకనా? మా గురించి ఇష్టమొచ్చింది రాసేటప్పుడు, యూట్యూబ్ లో పెట్టేటప్పుడు..ఇష్టమొచ్చినట్టు ఇలా కామెంట్స్ పెట్టేటప్పుడు మా పని గురించి, మా సంపాదన గురించి, మా కుటుంబాల గురించి మీరు ఆలోచించరే? మా ఫేమ్ పోయి, మా పని పోతే మీ అందరిలా మామూలు ఉద్యోగాలు కూడా చేసుకోలేమండి.. ఇది తెలియదా మీకు?’ అని ఆ నెటిజన్ కు అనసూయ క్లాస్ పీకింది.