చంద్రబాబుతో భేటీ అయిన కాంగ్రెస్ నేత శైలజానాథ్

  • చంద్రబాబుతో 10 నిమిషాలు భేటీ అయిన శైలజానాథ్
  • ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించానన్న మాజీ మంత్రి
  • కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ భేటీ అయ్యారు. అమరావతికి వెళ్లి, ముఖ్యమంత్రితో దాదాపు 10 నిమిషాలు చర్చించారు. అనంతరం మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం హైదరాబాదులో ఉన్న ఆసుపత్రుల్లో అమలుకావడం లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. మరోవైపు, చంద్రబాబుతో శైలజానాథ్ భేటీ కాంగ్రెస్, టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
Chandrababu
sailajanath
meeting

More Telugu News