బాలీవుడ్ డైరెక్టర్ తో బన్నీ చర్చలు?
Add ap7am to your home Screen

బాలీవుడ్ డైరెక్టర్ తో బన్నీ చర్చలు?

  • కథ రెడీ చేస్తోన్న విక్రమ్ కుమార్ 
  • త్వరలోనే రంగంలోకి త్రివిక్రమ్ 
  • బన్నీ కొత్త ఆలోచన  
ప్రస్తుతం బన్నీ .. విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఒక వైపున సెకండాఫ్ ను తీర్చిదిద్దుతూనే .. మరో వైపున మిగతా పనులను విక్రమ్ కుమార్ చకచకా కానిచ్చేస్తున్నాడు. ఇక బన్నీ ఈ సినిమా షూటింగుకి రెడీ అవుతూనే .. ఒక బాలీవుడ్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

 'సరైనోడు' హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అందువలన బన్నీ ఒక హిందీ సినిమా చేయబోతున్నాడని కొందరు చెబుతుంటే .. బాలీవుడ్ డైరెక్టర్ తో తెలుగు సినిమానే చేయనున్నాడని మరికొంతమంది అంటున్నారు. ఈ విషయంలోనే క్లారిటీ రావలసి వుంది. ఇటు విక్రమ్ కుమార్ తో చేసినా .. అటు బాలీవుడ్ డైరెక్టర్ తో చేసినా, ఒక వైపున త్రివిక్రమ్ తో ప్రాజెక్టును నడిపిస్తూనే ఉండాలనేది బన్నీ ఉద్దేశంగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.   
alu arjun
vikram kumar
trivikram

More Telugu News