రవితేజతో ఆ ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేశారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో ఆ ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేశారట!

  • రవితేజకి వరుస పరాజయాలు
  • శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'
  • నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్
ప్రస్తుతం రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ వారే .. రవితేజతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేశారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టును ఆపేసినట్టుగా తెలుస్తోంది. తమిళంలో విజయ్ హిట్ కొట్టిన 'తెరి' సినిమా నుంచి మూలకథను తీసుకుని ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు.

ఇటీవల రవితేజ చేసిన 'నేల టిక్కెట్టు' .. 'టచ్ చేసి చూడు' సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందువలన ఆయనతో వరుసగా రెండు సినిమాలు చేయడం కరెక్ట్ కాదని భావించినట్టు సమాచారం. 'అమర్ అక్బర్ ఆంటోని' రిజల్ట్ చూసుకుని అప్పుడు రెండవ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళదామని అలా దానిని హోల్డ్ లో పెట్టేశారట. ఆ సినిమా హిట్ అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది .. లేదంటే లేదన్న మాట.     
Raviteja

More Telugu News