కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ‘కాంగ్రెస్’కు ఒక్క ఓటు అదనంగా చేరనుంది!: టీడీపీ నేత డొక్కా సెటైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ‘కాంగ్రెస్’కు ఒక్క ఓటు అదనంగా చేరనుంది!: టీడీపీ నేత డొక్కా సెటైర్

  • ‘కాంగ్రెస్’ లో కిరణ్  చేరడంతో ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజం లేదు
  • ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన కిరణ్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారు
  • దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నేత నల్లారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరడంపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యంగ్యాస్త్రాలతో పాటు విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ చేరికతో ‘కాంగ్రెస్’కు ఒక్క ఓటు అదనంగా చేరనుందని, కిరణ్ చేరడంతో ఒక్క ఓటు పెరగడం మినహా ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజం లేదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లోనే ఈ విషయమై తాను ప్రశ్నించానని గుర్తుచేశారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నేత కిరణ్ కుమార్ రెడ్డి అని ఆరోపించారు.
kiran kumar reddy
dokka

More Telugu News