నానితో ఇప్పట్లో లేనట్టే .. కొత్త హీరోతో అవసరాల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నానితో ఇప్పట్లో లేనట్టే .. కొత్త హీరోతో అవసరాల

  • నటుడిగా అవసరాలకి మంచి పేరు 
  • దర్శకుడిగా దక్కిన విజయాలు
  • నానితో సినిమాకి మరింత సమయం  
'అష్టాచమ్మా' సినిమాతోనే నాని .. అవసరాల తమ ప్రయాణాన్ని కలిసి మొదలెట్టారు. ఆ తరువాత హీరోగా నాని తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ఇక అవసరాల శ్రీనివాస్ ఒక వైపున నటుడిగాను .. మరో వైపున దర్శకుడిగాను తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. 'ఊహలు గుసగుసలాడే' .. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు ఘన విజయాలను సాధించడంతో, నానితో ఒక సినిమా చేయాలని అవసరాల భావించాడు.

దర్శకుడిగా అవసరాల తనని తాను నిరూపించుకోవడం వలన .. ఆయనతో గల సాన్నిహిత్యం కారణంగా నాని చేసే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ఇంతవరకూ ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. అందుకు కారణం నాని బిజీగా వుండటమేననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక కొత్త హీరోతో సినిమా చేయడానికి అవసరాల సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోగా నాని కోసం మంచి కథను సిద్ధం చేసుకునే ఆలోచనలో అవసరాల వున్నాడని చెప్పుకుంటున్నారు.             
nani
avasarala

More Telugu News