మరో అపశ్రుతి... అమర్ నాథ్ యాత్రలో కొండ చరియలు విరిగిపడి హైదరాబాద్ మహిళ మృతి!

పవిత్ర అమర్ నాథ్ యాత్రలో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లో కురుస్తున్న వర్షాలకు కొండపై నుంచి బండరాళ్లు జారి పడటంతో అవి తగిలి ఓ మహిళ మరణించింది. హైదరాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పులిచెర్ల లక్ష్మి అనే గృహిణి, ఇటీవల యాత్రకు బయలుదేరి వెళ్లింది.

ఆమె నడుస్తుండగా, పై నుంచి ఓ పెద్ద బండరాయి దొర్లుతూ వచ్చి ఆమెను తాకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించగా, విషయాన్ని అధికారులు బంధువులకు చేరవేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Go Back to Shorts
Jammu And Kashmir
Amarnath
Yatra
Hyderabad
Rains

More Telugu News