తాటిపూడి రిజర్వాయర్ వద్ద కొబ్బరిబోండాం తాగుతూ.. కెమేరాకు పోజులిచ్చిన పవన్‌.. ఫొటోలు ఇవిగో!
Add ap7am to your home Screen

తాటిపూడి రిజర్వాయర్ వద్ద కొబ్బరిబోండాం తాగుతూ.. కెమేరాకు పోజులిచ్చిన పవన్‌.. ఫొటోలు ఇవిగో!

  • బహిరంగ సభలో పాల్గొని రిజర్వాయర్‌ వద్దకు పవన్‌
  • అక్కడి అందాలను తన స్మార్ట్‌ఫోన్‌లో బంధించిన జనసేనాని
  • అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు
తాటిపూడి రిజర్వాయర్ నీటి కోసం విజయనగరం జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఈరోజు ఆ రిజర్వాయర్‌ను సందర్శించారు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలోని దేవిగుడి జంక్షన్‌లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి అక్కడి అందాలను తన స్మార్ట్‌ఫోన్‌లో బంధించారు. కొబ్బరిబోండాం తాగుతూ, అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. పవన్‌ కల్యాణ్‌ను కలవడానికి స్థానికులు ఉత్సాహం చూపారు.              
Pawan Kalyan
Jana Sena

More Telugu News