100 టీ20 మ్యాచ్ లు ఆడిన దేశాలలో.. అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా టీమిండియా
- ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా
- ఇటీవల తొలి టీ20లో విజయం
- మొత్తం 100 మ్యాచులు ఆడిన భారత్
- ఈరోజు ఐర్లాండ్‌తో రెండో టీ20
ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు టీ20ల్లో టీమిండియా సాధించిన విజయాలను గురించి ప్రస్తావిస్తున్నారు. టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ ఉంది. ఆడిన 100 మ్యాచుల్లో టీమిండియా 62 మ్యాచుల్లో విజయం సాధించింది. 100 మ్యాచ్‌లు ఆడిన మొత్తం దేశాల వివరాలను విశ్లేషిస్తే.. భారత్ 62 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 59, పాకిస్థాన్ 58, ఆస్ట్రేలియా 53, శ్రీలంక 51 విజయాలతో భారత్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.