కడప పౌరుషాన్ని రెచ్చగొట్టొద్దు.. ఇదేమీ సినిమా కాదు!: పవన్ కల్యాణ్ పై సీఎం రమేష్ ఫైర్
- మీ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది
- ఏదైనా మాట్లాడాలనుకుంటే దీక్షాస్థలికి వచ్చి మాట్లాడాలి
- భావి తరాల కోసమే మా దీక్ష
ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందంటూ పవన్ చేసిన ఆరోపణలు ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తున్నాయని రమేష్ చెప్పారు. చేసిన ఆరోపణలపై పవన్ కల్యాణ్ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే దీక్షాస్థలికి వచ్చి మాట్లాడాలని అన్నారు. తాము చేపట్టిన దీక్ష స్వప్రయోజనాల కోసం కాదని... భావి తరాల కోసమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.