agri gold: అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీపీఐ నేతలకు ముడుపులందాయి: వైసీపీ నేత సుధాకర్ బాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుపై వైసీపీ అధికార ప్రతినిధి టీజీఆర్ సుధాకర్ బాబు ఆరోపణలు చేశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఈ ఇద్దరు నేతలకు ముడుపులు అందాయని ఆరోపించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన ఓ సూచన చేశారు. రామకృష్ణతో పవన్ జాగ్రత్తగా ఉండాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూములు దోచుకునే పనిలో చంద్రబాబు, లోకేశ్, మంత్రులు పడ్డారని ఆరోపించారు. లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు కూడా లింగమనేని భూములిచ్చారని, భూ దోపిడీకి పాల్పడుతున్న లింగమనేని ఎస్టేట్స్ పై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
Go Back to Shorts
agri gold
YSRCP
cpi

More Telugu News