హైదరాబాద్ లో ఆరడుగుల మేర కుంగిన రోడ్డు!
- బిజీగా ఉండే బోయినపల్లిలో ఘటన
- రహదారి కింద ఉన్న డ్రైనేజ్ పైప్ లైన్
- భయాందోళనల్లో స్థానిక ప్రజలు
ఒక్కసారిగా గుంత ఏర్పడగా, ఆ సమయంలో ఏ మోటారిస్టు లేదా పాదచారులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ రహదార్ల కింద ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్నో పైప్ లైన్లు బలహీనమై ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని, వాటిని వెంటనే మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై గుంత పడిన ప్రాంతాన్ని సందర్శించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉమాశంకర్, మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు వివరించారు.