Arvind Kejriwal: ధర్నా విరమించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం ఆయన ధర్నా విరమించారు. ఐఏఎస్‌ల సమ్మెకు వ్యతిరేకంగా చేసిన ఆయన ధర్నా 9 రోజుల పాటు కొనసాగింది. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవ తీసుకోవాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా నిరాహార దీక్ష చేసిన ఇద్దరు మంత్రులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ చేసిన ధర్నాకు పలు రాష్ట్రాల సీఎంల మద్దతు కూడా లభించింది.