వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ దుర్మార్గం ఏంటీ?: స్వామి పరిపూర్ణానంద
Add ap7am to your home Screen

వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ దుర్మార్గం ఏంటీ?: స్వామి పరిపూర్ణానంద

  • గుడి కమాన్ కు "క్రైస్తవ సువార్త సభల"  ప్లెక్సీ
  • అభ్యంతరం వ్యక్తం చేసిన స్వామి పరిపూర్ణానంద
  • బాధ్యత మాది కాదంటూ తప్పించుకుంటున్న ఆలయ అధికారులు
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధిలోని గుడి కమాన్ కు "క్రైస్తవ సువార్త సభల" ప్లెక్సీని అడ్డంగా కట్టడం పట్ల స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని, ‘బాధ్యత మాది కాదు’ అంటూ నగర పంచాయతీ, రక్షక్ అధికారులు తప్పించుకున్నారని ఆరోపించారు. గుడి కమాన్ కు ఇలాంటి ప్లెక్సీలు కట్టడం దుర్మార్గం.. ఇక వేములవాడ అధికారుల మనసును ఎవరు మార్చాలంటూ స్వామి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు.
vemulawada
Telangana

More Telugu News