మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ కు వర్షాలు!: వాతావరణ శాఖ
- మరో నాలుగు రోజులు వేచి చూడాలి
- తెలంగాణపై రుతుపవనాల ప్రభావం తక్కువే
- హైదరాబాద్ వాతావరణ శాఖ
ఇక ఎండ వేడిమి మరో మూడు నాలుగు రోజుల పాటు ఉంటుందని, 22వ తేదీన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ అధికారి రాజారావు వెల్లడించారు. తెలంగాణపై రుతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మరిన్ని వర్షాలకు చాన్స్ ఉందని తెలిపారు.