బాలయ్య 'ఎన్టీఆర్' సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
Add ap7am to your home Screen

బాలయ్య 'ఎన్టీఆర్' సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

  • జనవరి 9న సినిమా విడుదల
  • 1983లో అదే రోజున తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్
  • సంక్రాంతి బరిలో మంచి ట్రాక్ రికార్డున్న బాలయ్య
మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపింది. 1983లో అదే రోజున ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో, అదే రోజున సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న బాలయ్య... ఈ సినిమాతో మరో హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా... క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
ntr
movie
Balakrishna
release
date
tollywood

More Telugu News