అనసూయ ఫ్యాన్స్ అప్పట్లో నాపై అసభ్యకర కామెంట్లు పెట్టారు: రష్మి
- నేను జబర్దస్త్ లోకి వచ్చే సమయానికే అనసూయకు మంచి ఫాలోయింగ్ ఉంది
- మా మధ్య పోటీనే తప్ప, అసూయలు లేవు
- హోం ఫుడ్ తినాలనిపిస్తే.. అనసూయ ఇంటికే వెళ్తా
అయితే, ఆ సమయంలో అనసూయ అభిమానులు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు పెట్టారని... వాటిని చూసి తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని రష్మి తెలిపింది. కానీ, ఆ తర్వాత జబర్దస్త్ టీమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నెమ్మదిగా కోలుకున్నానని చెప్పింది. అనసూయకు, తనకు మంచి సంబంధాలు ఉన్నాయని... ఎప్పుడైనా తనకు హోం ఫుడ్ తినాలనిపిస్తే, అనసూయ ఇంటికే వెళ్తానని తెలిపింది.