Arvind Kejriwal: ఆందోళన కొనసాగిస్తోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఐఏఎస్‌ అధికారులు చేస్తోన్న ఆందోళనను విరమింపజేయాలని, పలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేస్తోన్న నిరసన ధర్నా ఆరో రోజుకి చేరింది. అయితే, ఆయన చేస్తోన్న నిరసన తీరును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తప్పుబట్టారు.

కాగా, ఆప్‌ మంత్రుల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు నిన్నే రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోలేదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం వద్ద అంబులెన్స్‌లు కూడా ఉన్నాయి.
Go Back to Shorts
Arvind Kejriwal
New Delhi
agitation

More Telugu News