బిగ్ బాస్-2లో మసాలా ఉందేమో కాని ఫ్లేవర్ ఎక్కడుంది?: కత్తి కార్తీక
Add ap7am to your home Screen

బిగ్ బాస్-2లో మసాలా ఉందేమో కాని ఫ్లేవర్ ఎక్కడుంది?: కత్తి కార్తీక

  • సీజన్ 1లో ముగ్గురు తెలంగాణ వాళ్లు ఉన్నారు
  • ఈ సీజన్ లో ఒక్కరు కూడా లేరు
  • తెలంగాణ భాష వినిపించి ఉంటే.. ఫ్లేవర్ ఉండేది
బిగ్ బాస్-2 రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని కత్తి కార్తీక అభిప్రాయపడింది. బిగ్ బాస్-1లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో వీ6 ఛానల్ యాంకర్ గా జనాలను అలరించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ జానపదమో, ఆ భాషనో హౌస్ లో ఉంటే, ఆ మసాలా ఘాటు తగిలేదని కార్తీక తెలిపింది. తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని... ఈ సీజన్ లో కూడా అది కొనసాగి ఉంటే బాగుండేదని తెలిపింది. ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది. బిగ్ బాస్ లోకి తాను రాకముందు కేవలం తెలంగాణ ప్రజలకే తాను తెలుసని, బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత ఏపీ ప్రజలకు కూడా చేరువయ్యానని తెలిపింది.
bigboss
telugu
kathi karthika
telangana
contestants

More Telugu News