evm: ఈవీఎంల దుర్వినియోగానికి అవకాశాలు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఈవీఎంల పనితీరుపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, తమ పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ... యనమల చేసిన వ్యాఖ్యలు నిజమేనని అన్నారు. ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువునైనా దుర్వినియోగం చేయడం చాలా సులభమని చెప్పారు. కాగా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలని అన్నారు. గ్రామాల్లో పర్యటించడం కొందరు నేతలు మరచిపోతున్నారని అన్నారు.       
Go Back to Shorts
evm
Chandrababu
Andhra Pradesh

More Telugu News