ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నేను నామినేట్ అయ్యానట.. నాతో వస్తారా?: విజయ్ దేవరకొండ ఆఫర్
- http://www.rowdyclub.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి
- పేరు, వివరాలను ఇవ్వండి
- వారిలో ఒకరిని ఫిలింఫేర్‌కు తీసుకెళతా
తాను అటువంటి హీరోలతో పాటు ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిలింఫేర్‌కు నామినేట్ కావడం గొప్ప విషయమని, తనకు అవార్డు గెలిచినట్లే ఉందని అన్నాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తాను ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి వెళ్తున్నానని, కాబట్టి తనతో పాటు అభిమానుల్లో ఒకరిని తీసుకువెళతానని అన్నాడు. తనను ఎవరైతే బాగా ఇష్టపడతారో వారు http://www.rowdyclub.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలని కోరాడు. అక్కడ పేరు, వివరాలను ఇస్తే, వారిలో ఒకరిని తాను ఫిలింఫేర్‌కు తీసుకెళతానని చెప్పాడు. కాగా, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, మహానటి సినిమాలతో విజయ్ దేవరకొండ మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.