నాటి 'చిట్టినాయుడు' ఇప్పుడు హీరో అవుతున్నాడు!
Add ap7am to your home Screen

నాటి 'చిట్టినాయుడు' ఇప్పుడు హీరో అవుతున్నాడు!

  • అల్లు శిరీశ్ తాజా చిత్రంగా రీమేక్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం 
  • మరో హీరోగా నిన్నటి బాలనటుడు భరత్      
అల్లు శిరీశ్ తన తదుపరి సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన 'ఏబీసీడీ'కి ఇది రీమేక్. మలయాళంలో ఈ సినిమా దుల్కర్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వసూళ్లపరంగాను చెప్పుకోదగిన స్థాయిలో నిలిచింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీశ్ .. ఈ సినిమా రీమేక్ లో చేయడానికి అంగీకరించాడు.

ఈ సినిమాలో మరో యంగ్ హీరోకి కూడా ఛాన్స్ వుంది. ఆ పాత్ర కోసం 'భరత్' ను తీసుకున్నారు. అయితే ఇతను తమిళంలో హీరోగా చేసిన భరత్ కాదు .. తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టేసిన భరత్. 'వెంకీ' సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో మందు కలిపిన కూల్ డ్రింక్ కోసం చిత్రం శీను టీమ్ తో గొడవపడిన కుర్రాడే ఈ హీరో. పోకిరి' మూవీలో ఇలియానా తమ్ముడుగా ఆకట్టుకున్నాడు. 'రెఢీ' సినిమాలో చిట్టినాయుడు పాత్రలో కడుపుబ్బ నవ్వించాడు. అలాంటి ఈ కుర్రాడు ఇప్పుడు ఈ సినిమాతో హీరోగాను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. కథలో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్లనే భరత్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. 
bharath

More Telugu News