టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి
Add ap7am to your home Screen

టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి

  • నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డి
  • అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లోకి
  • గతంలో జెడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేసిన దామోదర్‌ రెడ్డి
నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో ఈరోజు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో తన అనుచరులతో కలిసి ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు బలమైన నేతగా ఉన్నారు.

ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి తమ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం పట్ల ఆయన అభ్యంతరాలు తెలిపారు. కాంగ్రెస్‌లో తన మాటకు విలువ ఇవ్వట్లేదని టీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో దామోదర్‌ రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలనను చూసి తమ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని హరీశ్ రావు అన్నారు.
Telangana
damodar
TRS
Congress

More Telugu News